పంచాంగ శ్రవణం లేదు.. వేదపండితుల ఆశీర్వచనమే..

సీఎం జగన్‌ ఉగాది రోజున విశ్రాంతికే పరిమితమయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే వేడుకలు నిర్వహించలేదని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో ఉగాది వేడుకలు ఉంటాయని, పంచాంగ శ్రవణం కూడా ఉంటుందని మొదట పార్టీవర్గాలు తెలిపాయి.

Published : 10 Apr 2024 05:40 IST

ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్‌
నేతలెవరూ రావొద్దని ముందే ఆదేశాలు

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, శావల్యాపురం-న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ఉగాది రోజున విశ్రాంతికే పరిమితమయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే వేడుకలు నిర్వహించలేదని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో ఉగాది వేడుకలు ఉంటాయని, పంచాంగ శ్రవణం కూడా ఉంటుందని మొదట పార్టీవర్గాలు తెలిపాయి. పంచాంగ శ్రవణం ఉంటుందని కార్యకర్తలు భారీఎత్తున రాగా, లేకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. సోమవారం రాత్రి వినుకొండ నుంచి రోడ్‌షోగా వచ్చిన జగన్‌ రాత్రి శావల్యాపురం మండలం గంటావారిపాలెం విడిది కేంద్రంలో బస చేశారు. మరుసటి రోజు మంగళవారం ఉగాది కావడంతో వేడుకలు ఏమైనా ఉంటాయేమోనని పార్టీ నేతలు కొందరు రాగా వారిని భద్రతా సిబ్బంది పంపించేశారు. అయితే ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లు విడిది కేంద్రంలోకి వెళ్లారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తరవాత వారికి ఉగాది పచ్చడి ఇచ్చారు. అరగంటలో పూజా కార్యక్రమం ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని