నేడు రంజాన్‌

ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు బుధవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి.

Updated : 11 Apr 2024 06:39 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు బుధవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి. చాంద్‌ ముబారక్‌.. అంటూ ముస్లిం సోదరులు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫితర్‌)ను గురువారం జరుపుకోవాలనే సూచనగా బుధవారం రాత్రి సైరన్‌ మోతలు వినిపించాయి. రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు ముగిశాయని మక్కా మసీదు సూపరింటెండెంట్‌ ఎం.ఎ.ఖదీర్‌ సిద్దీఖ్‌, మర్కజీ రూయెత్‌ ఏ హిలాల్‌ కమిటీ ప్రతినిధి మౌలానా ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని