రాజధాని రైతులకు మళ్లీ సీఆర్డీఏ నోటీసులు

రాజధాని రైతులకు సీఆర్డీఏ మరోసారి నోటీసులు పంపుతోంది. భూ సేకరణ, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతులు వాటిని రద్దు చేసుకొని ప్రత్యామ్నాయ ప్లాట్లు పొందాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Updated : 11 Apr 2024 06:45 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని రైతులకు సీఆర్డీఏ మరోసారి నోటీసులు పంపుతోంది. భూ సేకరణ, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతులు వాటిని రద్దు చేసుకొని ప్రత్యామ్నాయ ప్లాట్లు పొందాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్లాట్ల కేటాయింపునకు కొద్దినెలల కిందట లాటరీ ప్రక్రియకు సీఆర్డీఏ ప్రయత్నించగా రైతులు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు అంశంలో సీఆర్డీఏ సరైన పద్ధతి పాటించాలని న్యాయస్థానం సూచించింది. రైతులు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులకు తాజాగా మరోసారి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల లోపు తమ వివరణలను స్థానిక సీఆర్డీఏ కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఈ అంశంపై త్వరలోనే రైతులకు మార్గనిర్దేశం చేస్తామని రాజధాని ఐకాస ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని