దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్‌ మాసం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 11 Apr 2024 05:19 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్‌ మాసం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు ముగించి పండగ జరుపుకొంటున్న ముస్లింలకు ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంటా సుఖసంతోషాలు నింపాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో ప్రకటనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

మానవీయ విలువల ప్రబోధం.. రంజాన్‌: పవన్‌

ఈనాడు, అమరావతి: ‘ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్‌ పండుగను పవిత్రంగా జరుపుకొంటున్న ముస్లిం మత విశ్వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మానవత్వపు విలువలను ప్రబోధించే దివ్యఖురాన్‌ అవతరించిన ఈ మాసం ఎంతో పవిత్రమైంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఇస్లాం మత విశ్వాసులకు పండగ తరుణాన శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని