పోస్టర్లపై పూర్తి బాధ్యత ప్రచురణ కర్తదే

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కరపత్రాలు, పోస్టర్లలో ముద్రించే అస్పష్టమైన, రెచ్చగొట్టే అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరించింది.

Published : 11 Apr 2024 05:20 IST

రెచ్చగొట్టే అంశాలను తీవ్రంగా పరిగణిస్తాం
వాటి ముద్రణపై ఈసీ మార్గదర్శకాలు జారీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కరపత్రాలు, పోస్టర్లలో ముద్రించే అస్పష్టమైన, రెచ్చగొట్టే అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరించింది. వాటిలోని విషయానికి పూర్తి బాధ్యత ప్రచురణ కర్తే వహించాలని స్పష్టం చేసింది. అందులోని అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉండాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరపత్రాల ముద్రణపై ఆంక్షలను అమలు చేయాల్సిందిగా.. ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారి, ప్రధాన కార్యదర్శిలకు ఈసీ ఆదేశాలు జారీచేసింది. వాటిపై తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు ఉండాల్సిందేనని పేర్కొంది. అలా లేకుండా ఉన్నవాటిని వెంటనే తొలగించాలని స్థానిక, పురపాలక సంస్థలను ఈసీ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని