మా ఊరు ఇప్పుడు గుర్తొచ్చిందా..?

తన భార్య రాజ్యలక్ష్మి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు(వైకాపా)కు చేదు అనుభవం ఎదురైంది.

Published : 12 Apr 2024 06:08 IST

పోలవరం ఎమ్మెల్యేను నిలదీసిన కృష్ణాపురం గ్రామస్థులు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: తన భార్య రాజ్యలక్ష్మి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు(వైకాపా)కు చేదు అనుభవం ఎదురైంది. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం కృష్ణాపురానికి గురువారం మధ్యాహ్నం వచ్చిన ఆయన్ను గ్రామం మొదట్లోనే స్థానికులు అడ్డుకున్నారు. అరగంట పాటు నిలిపివేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అయిదేళ్లలో గుర్తుకురాని ఊరు.. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా అంటూ నిలదీశారు. రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి సౌకర్యం సరిగా లేక పొలాల నుంచి నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. పొరపాటు జరిగిందని, ఎన్నికల తర్వాత గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని బాలరాజు హామీ ఇవ్వడంతో వారు శాంతించి, ప్రచారానికి అనుమతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని