సెబ్‌ కార్యాలయంలో మంత్రి అంబటి హల్‌చల్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెబ్‌ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హల్‌చల్‌ చేశారు.

Updated : 12 Apr 2024 10:04 IST

ఇద్దరు నిందితులను విడిపించుకెళ్లినట్లు సమాచారం?

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెబ్‌ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హల్‌చల్‌ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న కేసులో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇద్దరు నిందితులను విడిపించుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి మండలం కొమెరపూడి వద్ద సెబ్‌ అధికారులు గురువారం చేపట్టిన తనిఖీల్లో.. ద్విచక్రవాహనంపై మద్యం తీసుకెళ్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారితో పాటు 170 మద్యం సీసాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని సెబ్‌ కార్యాలయానికి తరలించారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి సాయంత్రం సెబ్‌ కార్యాలయానికి వెళ్లారు. అధికారులతో వాగ్వాదానికి దిగి నిందితులను విడిపించుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై సెబ్‌ ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిందితులను పట్టుకోలేదని చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న మద్యం, ద్విచక్రవాహనాన్ని విడిచిపెట్టాలని మంత్రి కోరినా, అలా కుదరదని చెప్పినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని