రంజాన్‌ రోజు విశ్రాంతిలో ఏపీ సీఎం జగన్‌

రంజాన్‌ పర్వదినాన సీఎం జగన్‌ విశ్రాంతికి పరిమితమయ్యారు. బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద బుధవారం రాత్రి విడిది కేంద్రానికి చేరుకున్నారు.

Published : 12 Apr 2024 04:28 IST

ముస్లింలు శిబిరానికి రాగా అడ్డుకున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట: రంజాన్‌ పర్వదినాన సీఎం జగన్‌ విశ్రాంతికి పరిమితమయ్యారు. బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద బుధవారం రాత్రి విడిది కేంద్రానికి చేరుకున్నారు. రాత్రి సీఎం జగన్‌ భార్య భారతీరెడ్డి వచ్చారు. గురువారం రంజాన్‌ పండగ కావడంతో బస్సుయాత్రకు విరామం ఇచ్చారు. ఉదయం మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ శిబిరంలోకి వెళ్లి అరగంట మాట్లాడి వచ్చేశారు. విశ్రాంతి తీసుకుంటారని, ఎవరినీ కలవరని ముందే అధిష్ఠానం సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు శిబిరం వద్దకు రాలేదు. కొందరు ముస్లింలు జెండాలు పట్టుకుని శిబిరం వద్దకు వచ్చారు. కానీ అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం సీఎం ధూళిపాళ్ల నుంచి గుంటూరుకు బస్సుయాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం గుంటూరు శివార్లలో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని