ప్రార్థనల్లోనూ వైకాపా ప్రచార యావ

వైకాపా నేతలు పార్టీ ప్రచారానికి ప్రార్థనలనూ వదలడం లేదు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో  ఫ్యాన్‌ గుర్తున్న నీటి సీసాలు పంపిణీ చేసి.. ప్రచార యావను మరోసారి చాటుకున్నారు.

Published : 12 Apr 2024 04:36 IST

కడప (అరవిందనగర్‌), న్యూస్‌టుడే: వైకాపా నేతలు పార్టీ ప్రచారానికి ప్రార్థనలనూ వదలడం లేదు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో  ఫ్యాన్‌ గుర్తున్న నీటి సీసాలు పంపిణీ చేసి.. ప్రచార యావను మరోసారి చాటుకున్నారు. స్థానిక జమీల్‌ మొబైల్స్‌ దుకాణ యాజమాన్యం ‘ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలి’ అని తెలిపే స్టిక్కర్లున్న నీటి సీసాలను తయారు చేయించింది. వాటిని రంజాన్‌ ప్రార్థనలకు ఈద్గాల వద్దకొచ్చిన ముస్లింలకు పంచింది. ప్రతిపక్షాల స్టిక్కర్లు ఎక్కడైనా గోడలపై కనిపిస్తే వెంటనే తొలగించే యంత్రాంగం.. ఇక్కడ మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని