ధ్వంసం చేసేందుకు వైకాపా ఎప్పుడూ సిద్ధం

కట్టడం అంటే కష్టం. ధ్వంసం చేయడం..తొలగించడం అంటే ఎంతో ఇష్టం అన్నట్లుంది అధికార వైకాపా నేతల వ్యవహారం.

Published : 12 Apr 2024 06:05 IST

కట్టడం అంటే కష్టం. ధ్వంసం చేయడం..తొలగించడం అంటే ఎంతో ఇష్టం అన్నట్లుంది అధికార వైకాపా నేతల వ్యవహారం. అయిదేళ్లుగా నిర్వహణ సరిగా లేక, మరమ్మతులకు నోచుకోక రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారినా జగన్‌ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. పైగా సీఎం జిల్లాల పర్యటనల సమయంలో రహదారులపై అడ్డగోలుగా గోతులు తవ్వేసి బారికేడ్లు ఏర్పాటుచేసిన ఉదంతాలు ఉన్నాయి. చెట్లు, చెట్ల కొమ్మల నరికివేత ఘటనలకు కొదవేలేదు. ఎన్నికలు సమీపించిన వేళ కూడా వారిలో మార్పు రాలేదు. గుంటూరు జిల్లా ఏటుకూరులో శుక్రవారం జరగనున్న ‘మేమంతా సిద్ధం’ సభ కోసం జాతీయ రహదారి డివైడర్‌ను సైతం తొలగించి అధికారులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు. పక్కనే విశాలమైన అప్రోచ్‌ రోడ్‌లు ఉన్నా గంటల వ్యవధిలో ముగిసే ఎన్నికల ప్రచార సభ కోసం ఇలా జాతీయ రహదారి డివైడర్‌, అప్రోచ్‌ రోడ్‌ల రక్షణ గోడలు పూర్తిగా తొలగించి ధ్వంసం చేయడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు. గతంలో ఇదే రహదారికి పక్కన వైకాపా ప్లినరీ సభకు పలుచోట్ల అప్రోచ్‌ రోడ్ల రక్షణ గోడలు, కాలువలు చదును చేసి వదిలేశారు. 

ఈనాడు గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని