ముస్లింల భవితకు అండగా ఉంటాం

రాష్ట్రంలో ముస్లింల భద్రతకు, భవిష్యత్తుకు రక్షణ లేదని, వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తామని, భవితకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Published : 12 Apr 2024 04:23 IST

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్‌ కుట్ర
రంజాన్‌ వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో ముస్లింల భద్రతకు, భవిష్యత్తుకు రక్షణ లేదని, వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తామని, భవితకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రంజాన్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేకు కోసి ముస్లింలకు ‘ఈద్‌ ముబారక్‌’ తెలిపారు. ‘1995-2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగకుండా కాపాడాం. 2014-19లో పొత్తు సమయంలోనూ మీ హక్కులను కాపాడుతూనే ఉర్దూ యూనివర్సిటీలు, హజ్‌హౌస్‌లు నిర్మించాం. దుల్హన్‌ వంటి పథకాలు అమలుచేశాం. జగన్‌ ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు వేచి ఉన్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలి. 2014-19లో ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కాపాడేందుకు సుప్రీంకోర్టులో పోరాడాం.’ అని చంద్రబాబు వివరించారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని జగన్‌కు సవాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని