ఐఏఎస్‌లను తొలగిస్తే ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు?: బొత్స

‘భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్రంలోని 30 మంది ఐఏఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారంతా చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో పనిచేసిన వారే.

Published : 12 Apr 2024 04:24 IST

ఈనాడు, విజయనగరం: ‘భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్రంలోని 30 మంది ఐఏఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారంతా చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో పనిచేసిన వారే. వారందరినీ తీసేస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. తాము సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరో మెరుగైన విధానం తీసుకొచ్చామన్నారు. వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చాలా కీలకమని, ఆ ఓటర్లను గుర్తించి వైకాపాకు ఓటేసేలా చూడాలన్నారు. తాను కబ్జాలకు పాల్పడ్డానని నిరూపిస్తే ఎన్నికల్లో నామినేషన్‌ వేయనని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని