రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి లేకుండా చేసింది

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైకాపా సర్కారు వెళ్లగొట్టి.. కొత్తవి తీసుకురాక యువతకు ఉపాధి లేకుండా చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 12 Apr 2024 04:26 IST

అరాచక పాలనను ఓటు అనే ఆయుధంతో అంతమొందించండి
నారా భువనేశ్వరి పిలుపు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైకాపా సర్కారు వెళ్లగొట్టి.. కొత్తవి తీసుకురాక యువతకు ఉపాధి లేకుండా చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో గుండెపోటుతో మృతిచెందిన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన పార్టీ అభిమాని దాచేపల్లి శివరామయ్య కుటుంబ సభ్యులను ఆమె గురువారం పరామర్శించారు. అండగా ఉంటామంటూ వారికి హామీ పత్రం ఇచ్చారు. భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మార్చి.. యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో గందరగోళ పరిస్థితులు కల్పించారన్నారు. మూడు రాజధానులంటూ ఉన్న రాజధానిని నష్టపరిచి.. రైతులను కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. హైకోర్టు తప్ప అన్ని ఆస్తులను తాకట్టుపెట్టి దోచుకున్న ఈ ప్రభుత్వం.. ప్రజల సొంత ఆస్తులనూ లాక్కునే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ.. కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని