రుషికొండ బీచ్‌ వద్ద గుడిసెలో ‘హరితా రెస్టారెంట్‌’!

వైకాపా పాలనలో ‘హరితా రెస్టారెంట్‌’ను ఓ చిన్న గుడిసెలో నిర్వహించే దుస్థితి దాపురించింది. రుషికొండపై గతంలో ఉన్న హిల్‌ రిసార్ట్‌ను కూల్చేసి సీఎం కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో రాజసౌధం నిర్మించి ప్రారంభించారు.

Updated : 12 Apr 2024 16:22 IST

ఇదీ పర్యటక రంగ దుస్థితి

ఈనాడు, విశాఖపట్నం: వైకాపా పాలనలో ‘హరితా రెస్టారెంట్‌’ను ఓ చిన్న గుడిసెలో నిర్వహించే దుస్థితి దాపురించింది. రుషికొండపై గతంలో ఉన్న హిల్‌ రిసార్ట్‌ను కూల్చేసి సీఎం కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో రాజసౌధం నిర్మించి ప్రారంభించారు. ఇది పర్యటక ప్రాజెక్టుగానే కొనసాగుతుందని చెప్పారే కానీ వినియోగించడం లేదు. మరో వైపు అప్పూఘర్‌లోని హరితా రిసార్టును నవీకరిస్తుండటంతో తాత్కాలికంగా మూసేశారు. దీంతో విశాఖ నుంచి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో రుషికొండ బీచ్‌ వద్ద చిన్న పాకలో టూరిజం రెస్టారెంటు నిర్వహిస్తున్నారు. గతంలో టూరిజం రెస్టారెంట్‌ అంటే ఒక బ్రాండింగ్‌ ఉండేదని.. ఇప్పుడు రోడ్డు పక్కన చిన్న హోటల్‌ మాదిరి తయారైందని ఇక్కడకు వస్తున్న పర్యాటకులు చర్చించుకుంటున్నారు. రుషికొండ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో 5 స్టార్‌ వసతి, రీక్రియేషన్‌ క్లబ్‌లు వస్తాయని అప్పట్లో వైకాపా నేతలు ఊదరగొట్టారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని