బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ కొరడా

రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉద్యోగి వెంకటప్పారెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది.

Published : 13 Apr 2024 04:11 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉద్యోగి వెంకటప్పారెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టడంతో తెదేపా జిల్లా నాయకులు ఇటీవల ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. వెంకటప్పారెడ్డికి షోకాజు నోటీసు జారీచేసింది. ఆయన వివరణఇస్తూ.. తన ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైందని, ఎవరో పోస్టులు పెట్టారంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఈసీ ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోవడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించాలని ఏఎన్‌యూకి సమాచారం ఇచ్చింది. ఈసీ ఆదేశాలతో వెంకటప్పారెడ్డిని విధుల నుంచి తప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని