ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం చేసిన మరో అయిదుగురిపై వేటు

వైకాపాకి ఓటేయాలని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రచారం చేసిన పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేతల్లో మరో అయిదుగురిని ఆర్టీసీ అధికారులు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

Published : 13 Apr 2024 04:11 IST

ఈనాడు, అమరావతి: వైకాపాకి ఓటేయాలని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రచారం చేసిన పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేతల్లో మరో అయిదుగురిని ఆర్టీసీ అధికారులు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డితోపాటు, పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లా చంద్రయ్యతో కలిపి ఆసంఘానికి చెందిన నేతలు గతనెల 31న కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో వైకాపాకి అనుకూలంగా ప్రచారం చేశారు. తొలుత ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షునితోపాటు, వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు యూనియన్‌ నేతలను సస్పెండ్‌చేశారు. తాజాగా తిరుపతి, బనగానపల్లి, ఒంగోలు డిపోల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్న మరో అయిదుగురు యూనియన్‌ నేతల్ని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని