వచ్చే ఎన్నికల్లో మా సత్తా చాటుతాం

రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించేవారికే తమ మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల ఐకాస కన్వీనర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, ఛైర్మన్‌ లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 04:30 IST

ఏపీ ప్రైవేటు విద్యాసంస్థల ఐకాస

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించేవారికే తమ మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల ఐకాస కన్వీనర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, ఛైర్మన్‌ లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. 2019లో ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, తమను చీడపురుగులా చూశారని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. కడపలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమకు 50 లక్షల ఓట్లు ఉన్నాయని, తమ శక్తి చూపిస్తామని తెలిపారు. ఈ నెల 14న కడపలోని కృష్ణా కల్యాణ మండపంలో ఉమ్మడి కడప జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వైకాపాకు మద్దతిచ్చే ప్రైవేటు విద్యాసంస్థలతో కొందరు ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, దాంతో సంఘానికి సంబంధం లేదన్నారు. ఎంతో కష్టపడి డీఎడ్‌ కళాశాలలు తెచ్చుకున్నామని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని మూసివేయించిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, అమ్మఒడి పథకాల డబ్బులు పాఠశాలల యాజమాన్యాల ఖాతాలో వేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సంఘ నాయకుడు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని