వలలో చిక్కిన భారీ తిమింగలం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెంలో మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది.

Published : 13 Apr 2024 04:33 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెంలో మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. పరవాడ మండలం వాడచీపురపల్లికి చెందిన మత్స్యకారులు తీరంలో చేపల వల లాగుతుండగా చాలా బరువు అనిపించింది. పెద్దఎత్తున చేపలు పడ్డాయనుకొని వలను అతి కష్టం మీద తీరానికి లాక్కొని రాగా.. అందులో తిమింగలం కనిపించింది. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉండటంతో తొలుత మత్స్యకారులు ఆందోళన చెందారు. కొందరు ధైర్యం చేసి దాన్ని పరిశీలించి అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. తిరిగి సముద్రంలోకి పంపేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అక్కడే వదిలేశారు. తిమింగలం అక్కడే చనిపోతే రోజుల తరబడి దుర్గంధం భరించలేమని, వెంటనే తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరారు. పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లకు చెందిన కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేస్తుండటం వల్ల గతంలోనూ చిన్నచిన్న తిమింగలాలు చనిపోయి తీరానికి చేరాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని