కుప్పకూలిన బాలికల వసతిగృహం గది పైకప్పు

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహంలోని ఓ గది పైకప్పు గురువారం రాత్రి కుప్పకూలింది.

Published : 13 Apr 2024 04:34 IST

ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహంలోని ఓ గది పైకప్పు గురువారం రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. 40 మంది బాలికలు ఉంటున్న ఈ హాస్టల్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ భవనం ప్రమాదకరంగా ఉందని హాస్టల్‌ ఇన్‌ఛార్జి వార్డెన్‌ సత్యవతి గతంలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరిగిన హాస్టల్‌ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారి నరసయ్య, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కృష్ణయ్య శుక్రవారం పరిశీలించారు. స్థానిక డీఎస్పీ మురళీధర్‌, సీఐ వెంకటరమణ విద్యార్థినులతో మాట్లాడారు. వారిని మరో వసతిగృహానికి తరలించారు. ఆ హాస్టల్‌ కూడా ప్రమాదకరంగానే ఉందని బాలికలు చెబుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని