గిరినాగు.. ఎంత పెద్దదో..!

12 అడుగుల గిరినాగు (కింగ్‌ కోబ్రా) జనావాసాల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలోని రేకుల షెడ్‌లో ప్రజలు గిరినాగును చూశారు.

Updated : 13 Apr 2024 14:04 IST

12 అడుగుల గిరినాగు (కింగ్‌ కోబ్రా) జనావాసాల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలోని రేకుల షెడ్‌లో ప్రజలు గిరినాగును చూశారు. అంతపెద్ద నాగును చూసి భయంతో అటవీ శాఖ సిబ్బంది, స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌కు సమాచారం ఇచ్చారు. వెంకటేష్‌ బృందం వచ్చి 30 నిమిషాలపాటు శ్రమించి గిరినాగును సంచిలో బంధించారు. అనంతరం రామచంద్రాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

న్యూస్‌టుడే, మాడుగుల గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని