సీఎం జగన్‌ రాక.. గొడ్డలికి పని పక్కా!

సీఎం జగన్‌ వస్తున్నారంటే చాలు.. ఆయన పర్యటించే మార్గంలో పచ్చని చెట్లపై వేటు పడుతోంది. ఈ నెల 13న విజయవాడలో జగన్‌ బస్సు యాత్ర ఉంది.

Updated : 13 Apr 2024 06:06 IST

విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌, మధురానగర్‌), న్యూస్‌టుడే : సీఎం జగన్‌ వస్తున్నారంటే చాలు.. ఆయన పర్యటించే మార్గంలో పచ్చని చెట్లపై వేటు పడుతోంది. ఈ నెల 13న విజయవాడలో జగన్‌ బస్సు యాత్ర ఉంది. దీంతో అధికారులు శుక్రవారం ఆ మార్గాల్లో చెట్ల కొమ్మలను నరికివేయిస్తున్నారు. తొలుత నగరపాలక సిబ్బంది చెట్ల కొమ్మలు కొట్టేందుకు చూసినా.. అధికారులు అడ్డుకున్నారు. సాయంత్రం ఏమైందో ఏమోగానీ సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, అజిత్‌సింగ్‌నగర్‌లోని కృష్ణా హోటల్‌ కూడలిలో వారే కొట్టేయించారు. వైకాపా నాయకుల ఒత్తిడి కారణంగానే చెట్లపై గొడ్డలి వేటు వేశారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో కొద్ది రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని