శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

శ్రీవారి అభిషేక సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ శుక్రవారం పాల్గొన్నారు.

Published : 13 Apr 2024 04:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి అభిషేక సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ శుక్రవారం పాల్గొన్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

వీరితోపాటు జిల్లా ప్రొటోకాల్‌ న్యాయమూర్తి ఎం.గురునాథ్‌, ప్రొటోకాల్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, పీఆర్వో ధనంజయనాయుడు ఉన్నారు. అనంతరం న్యాయమూర్తులు ఇద్దరూ వేర్వేరుగా శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పాల్గొన్నారు.


శ్రీవారిని దర్శించుకున్న సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని