ఇంటర్‌ ఫలితాల్లో అగ్రస్థానాన కృష్ణా.. అట్టడుగున అల్లూరి, చిత్తూరు జిల్లాలు

ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 84%, గుంటూరు 81%, ఎన్టీఆర్‌ 79% ఉత్తీర్ణతతో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

Updated : 13 Apr 2024 06:05 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 84%, గుంటూరు 81%, ఎన్టీఆర్‌ 79% ఉత్తీర్ణతతో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా 48% ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో కృష్ణా 90%, గుంటూరు 87%, ఎన్టీఆర్‌ 87%, విశాఖపట్నం 84% ఉత్తీర్ణతతో ముందువరుసలో ఉండగా, చిత్తూరు 63%తో చివరిలో నిలిచింది. బాలురు, బాలికల ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా 82%, 86% చొప్పున సాధించి మొదటి స్థానంలో ఉండగా.. బాలురలో అనకాపల్లి 39%, బాలికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 50%తో అట్టడుగున నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని