సీఎం వస్తున్నారంటే చెట్లపై గొడ్డలి వేటే!

సీఎం జగన్‌ ఎక్కడికయినా పర్యటనకు వస్తున్నారంటే ఆ మార్గంలో పచ్చని చెట్లకు గొడ్డలి వేటు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రానున్నారు.

Published : 14 Apr 2024 03:58 IST

ఈనాడు, ఏలూరు: సీఎం జగన్‌ ఎక్కడికయినా పర్యటనకు వస్తున్నారంటే ఆ మార్గంలో పచ్చని చెట్లకు గొడ్డలి వేటు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రానున్నారు. సభ అనంతరం ఉండి, పాములపర్రు, గణపవరం, నారాయణపురం మీదుగా దూబచర్ల వెళతారు. ఈ నేపథ్యంలో ఉండి - కోలమూరు మధ్య ఉన్న భారీ వృక్షాలను అడ్డగోలుగా నరికేస్తున్నారు. అధికారులు దగ్గరుండి ఈ పని చేయిస్తున్నారు. సీఎం వస్తే ఏమిటని.. ఎన్నో ఏళ్ల నుంచి నీడనిస్తున్న చెట్లను ఎలా నరికేస్తారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు అత్యంత అధ్వానంగా ఉండే నారాయణపురం - ఉండి రహదారికి అధికారులు ఇప్పటి వరకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. సీఎం ఆ మార్గంలో వస్తున్నారనగానే హడావుడిగా గుంతలు పూడ్చే పనులు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని