ఇటు చూడు జగన్‌.. ఇదీ మీ నిర్వాకమే!

అమరావతి రాజధానిపై సీఎం జగన్‌ నాలుక ఎప్పుడైతే మడతపడిందో... అప్పటి నుంచి విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి రెండువైపులా చేపట్టిన భారీ నిర్మాణాలు ఆగిపోయాయి.

Updated : 14 Apr 2024 07:18 IST

అమరావతి రాజధానిపై సీఎం జగన్‌ నాలుక ఎప్పుడైతే మడతపడిందో... అప్పటి నుంచి విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి రెండువైపులా చేపట్టిన భారీ నిర్మాణాలు ఆగిపోయాయి. రూ.కోట్లతో చేపట్టిన నిర్మాణాలు నిలిచిపోవడంతో బిల్డర్లు, వాటిని కొనుగోలు చేసిన కొందరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అసంపూర్తి భవనాల ముందు నుంచే శనివారం సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వెళ్లింది. ఆ సమయంలో బస్సులోనే ఉన్న జగన్‌.. ప్రశ్నిస్తున్నట్లున్న ఆ భవనాల వైపు చూసీచూడనట్లు ముందుకు సాగారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని