టిడ్కో ఇళ్ల రుణ మాఫీ ప్రకటించాల్సిందే

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని టిడ్కో కాలనీ లబ్ధిదారుల రూ.650 కోట్ల రుణాన్ని రద్దు చేస్తూ ఆదివారం గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రకటించాలని కోరుతూ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాలనీలోని వివిధ బ్లాక్‌ల వద్ద, గుడివాడ పట్టణంలోని 10 ప్రాంతాల్లో నిరసన తెలిపారు.

Published : 14 Apr 2024 03:59 IST

ఒకే రోజు పది ప్రాంతాల్లో లబ్ధిదారుల నిరసన

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని టిడ్కో కాలనీ లబ్ధిదారుల రూ.650 కోట్ల రుణాన్ని రద్దు చేస్తూ ఆదివారం గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రకటించాలని కోరుతూ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాలనీలోని వివిధ బ్లాక్‌ల వద్ద, గుడివాడ పట్టణంలోని 10 ప్రాంతాల్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గుడివాడ నెహ్రూచౌక్‌లో నాడు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు రూపాయికే ఇల్లు కేటాయించాలన్నారు. ఆదివారం బహిరంగ సభలో సీఎం ప్రకటన చేయకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధి జేమ్స్‌ మాట్లాడుతూ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి వైకాపా ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. కార్మికులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామన్న హామీని కూడా తక్షణం నెరవేర్చాలన్నారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, సహాయ కార్యదర్శి షేక్‌ గౌస్‌ పీరా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గౌరీశంకర్‌ సెంటరు, నైజాంపేట, పెద్దవీధి తదితర ప్రాంతాల్లో టిడ్కో లబ్ధిదారులు ధర్నాలు చేసి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని