ఉన్నత విద్యామండలి అత్యుత్సాహం

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించకుండానే ఏపీపీఎస్సీకి ఉన్నత విద్యామండలి అత్యుత్సాహంతో రూ.2.57 కోట్లు చెల్లించింది.

Published : 14 Apr 2024 04:04 IST

పరీక్ష పెట్టకుండానే ఏపీపీఎస్సీకి రూ.2.5 కోట్ల చెల్లింపు
హైకోర్టులో కేసున్నా.. పట్టించుకోకుండా నిధుల బదిలీ

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించకుండానే ఏపీపీఎస్సీకి ఉన్నత విద్యామండలి అత్యుత్సాహంతో రూ.2.57 కోట్లు చెల్లించింది. దరఖాస్తుల సమయంలోనే ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దరఖాస్తులు స్వీకరించినా, వాటి ఆధారంగా ప్రొవిజనల్‌ జాబితా తయారీ చేపట్టొద్దని గతేడాది నవంబరు 17న హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం ఇప్పటికీ న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో తమకు నిధులిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామంటూ ఉన్నత విద్యామండలికి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. మొత్తం 35 వేల మందికి 97 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకు ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. మొత్తంగా రూ.5 కోట్ల వరకు ఇవ్వాలని కోరింది. దీనిపై ముందూవెనుకా ఆలోచించకుండా ఉన్నత విద్యామండలి రూ.2.5 కోట్లను ఏపీపీఎస్సీకి చెల్లించేసింది. హైకోర్టులో కేసుపై ఇంతవరకు స్పష్టత రాలేదు. విశ్వవిద్యాలయాలు ఇచ్చిన నోటిఫికేషన్లు ఉంటాయా.. రద్దవుతాయా? అనే దానిపై సందిగ్ధత వీడలేదు. అవేవీ పట్టించుకోకుండా ఉన్నత విద్యామండలి అత్యుత్సాహం చూపుతూ నిధులను బదిలీ చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని