జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమో!

ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్నన్ని కేసులు ముంబయి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమోనని సీబీఐ మాజీ    డైరెక్టర్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Updated : 14 Apr 2024 08:32 IST

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్నన్ని కేసులు ముంబయి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమోనని సీబీఐ మాజీ    డైరెక్టర్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయనకు తెలివి తక్కువై దేశం విడిచి పారిపోయారని, ఇక్కడే ఉండి రాజకీయాల్లో    చేరి ఉంటే కచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవారని ఎక్స్‌ వేదికగా  శనివారం ట్వీట్‌ చేశారు. ‘సీఎం జగన్‌పై 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి. 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. అంతేకాదు.. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. ఇవన్నీ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో జగనే స్వయంగా పేర్కొన్నారు. దావూద్‌ ఇబ్రహీంపై కూడా ఇన్ని కేసులుగానీ, నేరాభియోగాలుగానీ ఉన్నాయా అంటే సందేహమే. ఆయన దేశం విడిచి పారిపోకుండా రాజకీయాల్లో చేరి ఉంటే మహారాష్ట్ర సీఎం అయ్యేవారు. మేరా భారత్‌ మహాన్‌’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. జగన్‌పై నమోదైన కేసులు, అభియోగాల జాబితాను ఈ ట్వీట్‌కు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని