బెజవాడలో సీఎం బస్సు యాత్రకు స్పందన అంతంత మాత్రమే

గుంటూరు జిల్లా నుంచి తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్‌ జిల్లాలోకి నాలుగు గంటలకు రావాల్సిన బస్సు యాత్ర 5.30 గంటలకు వచ్చింది. తాడేపల్లి వద్ద సీఎం సతీమణి భారతీరెడ్డి వచ్చి చేతులు ఊపారు.

Updated : 14 Apr 2024 07:55 IST

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా నుంచి తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్‌ జిల్లాలోకి నాలుగు గంటలకు రావాల్సిన బస్సు యాత్ర 5.30 గంటలకు వచ్చింది. తాడేపల్లి వద్ద సీఎం సతీమణి భారతీరెడ్డి వచ్చి చేతులు ఊపారు. వారధి వద్ద రద్దీ కనిపించేందుకు ట్రాఫిక్‌ చాలాసేపు ఆపేశారు. టీవీ విజువల్స్‌ కోసం ఇక్కడ ఆపివేయడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచి అవస్థలు పడ్డారు. బస్సుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ అభ్యర్థులు దేవినేని అవినాష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, ఆసిఫ్‌లు  సీఎం పక్కనే ఉన్నారు. జగన్‌ ఎక్కడా ప్రసంగించలేదు,. చేతులు ఊపుతూ వెళ్లారు. విజయవాడలోని పశువుల ఆసుపత్రి కూడలి వద్ద జనం లేక బస్సుయాత్ర వెలవెలబోయింది. సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో స్పందన కరవైంది. అసలు జనం రాలేదని వైకాపా నేతలే చెప్పుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని