జగన్‌పై దాడి ఘటన.. హత్యాయత్నం కేసు నమోదు

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రోడ్‌షోలో సీఎం పక్కనే ఉన్న మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం సీఐ గురుప్రకాశ్‌ కేసు కట్టారు.

Published : 15 Apr 2024 05:25 IST

పోలీసులకు మాజీ మంత్రి వెలంపల్లి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రోడ్‌షోలో సీఎం పక్కనే ఉన్న మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం సీఐ గురుప్రకాశ్‌ కేసు కట్టారు. హత్యాయత్నం జరిగిందంటూ ఐపీసీ సెక్షన్‌ 307ను చేర్చారు. ‘రోడ్డు షోలో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్‌.. సింగ్‌నగర్‌లోని డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు వచ్చారు. ఆయన ప్రజలకు అభివాదం చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి పదునైన రాయి లేదా క్యాట్‌బాల్‌ను విసిరారు. ఈ దాడిలో సీఎం నుదుటికి గాయమైంది. పక్కనే ఉన్న నాకు తగిలి నా ఎడమ కంటికి కూడా గాయమైంది. ముఖ్యమంత్రిని అంతమొందించేందుకే దాడి చేశారు’ అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెలంపల్లి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని