నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి విడిది కేంద్రంలో విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్‌ సోమవారం నుంచి బస్సుయాత్రలో పాల్గొంటారు.

Published : 15 Apr 2024 04:37 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి విడిది కేంద్రంలో విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్‌ సోమవారం నుంచి బస్సుయాత్రలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బయలుదేరి గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ మీదుగా హనుమాన్‌జంక్షన్‌-గుడివాడ రోడ్డులోకి చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు గుడివాడ నియోజకవర్గంలోని జొన్నపాడులో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటుంది. స్వల్ప విరామం అనంతరం ఇదే నియోజకవర్గంలో జనార్దనపురం మీదుగా సాయంత్రం 4 గంటలకు నాగవరప్పాడు చేరుకొని అక్కడ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత తిరిగి పెరికీడు మీదుగా హనుమాన్‌జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కలపర్రు మీదుగా రాత్రికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని