మమ్మల్ని కాలుష్యానికి బలి చేస్తారా?

సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకపోవడంతో ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా పరవాడ కలపాకపంచాయతీ శివారు మూలస్వయంభూవరం గ్రామస్థులు ప్రకటించారు.

Published : 15 Apr 2024 04:39 IST

ఊరిని తరలించేవరకు ఎన్నికల బహిష్కరణ
సింహాద్రి ఎన్టీపీసీ సమీప గ్రామంలో తీర్మానం

విశాఖపట్నం (పరవాడ), న్యూస్‌టుడే: సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకపోవడంతో ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా పరవాడ కలపాకపంచాయతీ శివారు మూలస్వయంభూవరం గ్రామస్థులు ప్రకటించారు. గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న ఎన్టీపీసీ నుంచి వచ్చే కాలుష్యంతో 20 ఏళ్లుగా గుండె, కిడ్నీ, చర్మ, శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నామని... సంపాదనలో ఎక్కువ మొత్తం వైద్యానికే ఖర్చు చేయాల్సి వస్తోందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పండకపోవడం, పశుగ్రాసం కొరత కూడా తీవ్రంగా ఉండటంతో జీవనం దుర్భరంగా మారిందని వాపోయారు. సమస్యను పరిష్కరిస్తామని ఏడాది క్రితం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఆ తర్వాత గ్రామాన్నే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల పరిష్కారంపై కలెక్టర్‌ స్పష్టమైన ప్రకటన ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని