కుంటనీరే పంటకు ఆధారం!

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు 2 గేట్లు ఏడాదిన్నర కిందట కొట్టుకుపోవడంతో జలాశయం దాదాపు ఖాళీ అయింది. నిల్వ ఉంటున్న కొద్దిపాటి నీటిని కాలువలకు ఇస్తున్నా.. అవి పంటలను కాపాడలేకపోతున్నాయి.

Published : 16 Apr 2024 04:47 IST

గుండ్లకమ్మ ఆయకట్టు పరిస్థితి

ఈనాడు, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు 2 గేట్లు ఏడాదిన్నర కిందట కొట్టుకుపోవడంతో జలాశయం దాదాపు ఖాళీ అయింది. నిల్వ ఉంటున్న కొద్దిపాటి నీటిని కాలువలకు ఇస్తున్నా.. అవి పంటలను కాపాడలేకపోతున్నాయి. దీంతో పదేళ్ల కిందట కరవు సంభవించినప్పుడు తవ్వుకున్న కుంటలే ఇప్పుడు రైతులకు దిక్కయ్యాయి. నాగులుప్పలపాడు మండలంలోని కండ్లకుంట గ్రామంలో గతంలో 20 మంది రైతులు కలిసి తవ్వుకున్న కుంటల్లోని నీటిని మోటార్లు పెట్టి పొలాలకు పారిస్తున్నారు. ‘పదేళ్లలో ఏనాడూ కుంట నీటిని వాడలేదు. ప్రాజెక్టు నీరు రాకపోవడంతో ఇప్పుడు అవే ఆధారమయ్యాయి. కుంటలు లేనివాళ్లు జలాశయం లోపల మోటార్లు పెట్టుకుంటున్నారు’ అని రైతులు ఆవేదన చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని