సీతారాముల కల్యాణోత్సవాలకు మండపేట బోండాలు

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తులు కొబ్బరిబోండాలు సిద్ధం చేస్తున్నారు.

Published : 16 Apr 2024 04:48 IST

మండపేట, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తులు కొబ్బరిబోండాలు సిద్ధం చేస్తున్నారు. మండపేటకు చెందిన కె.వి.ఎ.రామారెడ్డి 24 ఏళ్లుగా భద్రాచలంలో కల్యాణానికి అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే నవమి వేడుకలకూ బోండాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 17న భద్రాచలం, 22న ఒంటిమిట్ట రామాలయంలº కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని