బలవంతపు రాజీనామాలకు వాలంటీర్లు ససేమిరా

ఎన్నికల్లో వాలంటీర్లను సొంత సైన్యంగా వాడుకునేందుకు వైకాపా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1,200 మందికి పైగా వాలంటీర్లున్నారు.

Published : 16 Apr 2024 04:50 IST

100 మందిపై ఒత్తిడి తెస్తే.. 9 మందే అంగీకారం

కనిగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వాలంటీర్లను సొంత సైన్యంగా వాడుకునేందుకు వైకాపా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1,200 మందికి పైగా వాలంటీర్లున్నారు. పక్షం రోజులుగా వైకాపా నాయకులు వీరి ఇళ్లకు వెళ్లి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించింది తామే కాబట్టి చెప్పినట్లు వినాలంటూ బెదిరింపులకు దిగారు. సోమవారం కనిగిరి ఎంపీడీవో కార్యాలయానికి 60 మంది, హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయానికి 40 మంది చొప్పున వాలంటీర్లను రాజీనామా చేయించేందుకు నాయకులు బలవంతంగా తీసుకొచ్చారు. వీరిలో 9 మంది మాత్రమే అధికారులకు రాజీనామా పత్రాలు సమర్పించగా, 91 మంది ససేమిరా అంటూ వెనుదిరిగారు. వైకాపా నేతలు వారిని బతిమాలినా మెత్తబడలేదు. ‘మా భవిష్యత్తు మాకు తెలుసు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితేంటి? ఆయన కూడా జీతం పెంచుతామంటున్నారు. అలాంటప్పుడు ఎవరైతే మాకెందుకు? మేం ఎలాంటి రాజకీయాల్లోనూ పాల్గొనబోం’ అని పలువురు తెగేసి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని