ప్రత్యేకహోదా అటకెక్కించారు.. రాజధాని లేని రాష్ట్రం చేశారు

సాక్షాత్తు పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను పదేళ్లుగా అటకెక్కించారని అరుణోదయ సంస్థ వ్యవస్థాపకులు విమలక్క విమర్శించారు.

Published : 16 Apr 2024 05:01 IST

అరుణోదయ సంస్థ వ్యవస్థాపకులు విమలక్క మండిపాటు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: సాక్షాత్తు పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను పదేళ్లుగా అటకెక్కించారని అరుణోదయ సంస్థ వ్యవస్థాపకులు విమలక్క విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 14న పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టామని, ఇది శ్రీకాకుళం వరకు సాగనుందని ఆమె వివరించారు. సోమవారం నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో విమలక్క మీడియాతో మాట్లాడారు. పదేళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు కార్పొరేట్ల దోపిడీ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని, వారి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం(ఏపీఆర్‌సీఎస్‌) నాయకులు కర్నాకుల వీరాంజనేయులు, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్‌టీయూ) కరీంబాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని