డోన్‌ ఐటీఐ పేరు మార్పు

నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం దువ్వూరి అన్నప్ప సోమయాజులు  ఐటీఐగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక, న్యాయశాస్త్రాల్లో సోమయాజులు నిపుణులని జీఓలో పేర్కొంది.

Published : 16 Apr 2024 05:03 IST

దువ్వూరి అన్నప్ప సోమయాజులు ఐటీఐగా ఉత్తర్వులు

కర్నూలు, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం దువ్వూరి అన్నప్ప సోమయాజులు  ఐటీఐగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక, న్యాయశాస్త్రాల్లో సోమయాజులు నిపుణులని జీఓలో పేర్కొంది. ఈ పేరు మార్పు స్థానికంగా చర్చనీయాంశమైంది. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలకు సోమయాజులు సన్నిహితులు కావడం వల్లనే ఐటీఐకి ఆయన పేరుపెట్టారని  ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని