సీఐడీ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా

సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ దర్యాప్తు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అరెస్టుకు ఉత్తర్వులివ్వాలని అభ్యర్థిస్తూ..

Published : 16 Apr 2024 05:50 IST

ఈనాడు, అమరావతి: సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ దర్యాప్తు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అరెస్టుకు ఉత్తర్వులివ్వాలని అభ్యర్థిస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. పత్రికా సమావేశంలో లోకేశ్‌ మాట్లాడిన అంశాలకు సంబంధించి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి గతేడాది డిసెంబర్‌ 29న ప్రసారం చేసిన విషయాలతో సీఐడీ ఇటీవల మెమో దాఖలు చేసింది. సోమవారం జరిగిన విచారణలో లోకేశ్‌ తరఫు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఈ మెమోపై అభ్యంతరం తెలిపారు. సీఐడీ ముందుగా వేసిన పిటిషన్లో ఈవిషయాన్ని ప్రస్తావించలేదన్నారు. వారి మెమోపై కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరడంతో విచారణ వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని