మండుతున్న ఆంధ్రప్రదేశ్‌.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది.

Published : 17 Apr 2024 09:55 IST

శ్రీకాకుళం జిల్లాలో 45.4డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. మంగళవారం 88 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 45.1, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఎన్టీఆర్‌, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. బుధవారం 46మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని.. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరకోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ సంస్థ అంచనా వేసింది.

నేడు వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు..

విజయనగరం 24, శ్రీకాకుళం 23, పల్నాడు 22, తూర్పుగోదావరి 18, అనకాపల్లి 17, గుంటూరు 15, కాకినాడ 15, పార్వతీపురం మన్యం 15, ఏలూరు 13, అల్లూరి సీతారామరాజు 12, కృష్ణా 10, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 9, ప్రకాశం 8, ఎన్టీఆర్‌ 6, తిరుపతి 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, బాపట్ల 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని