జగన్‌ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు

తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు.

Updated : 17 Apr 2024 10:04 IST

ఈనాడు, ఏలూరు: తలా రూ.500 నోటు. మగవారికి మద్యం సీసా. బిర్యానీ పొట్లం. ఊరూరా జనాన్ని తరలించేందుకు 1,200 బస్సులు. ఎక్కడెక్కడి నుంచి ఎంతమందిని రప్పించాలో నాయకులకు టార్గెట్లు. ఇంతచేసినా తీరా అధినేత ప్రసంగించే వేళ సభా ప్రాంగణం జనం లేక బోసిపోయింది. భీమవరంలో మంగళవారం సీఎం సభ కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా  నుంచి భారీగా తరలించారు.

మూడో వంతు జనం బస్సుల్లోంచి దిగకపోగా, దిగిన వారు సభా ప్రాంగణంలో నిల్చోలేకపోయారు. బస్సుయాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుండగానే.. జనాలు పెద్ద సంఖ్యలో వెళ్లిపోతూ కనిపించారు. జగన్‌ ప్రసంగించేటప్పుడు కొన్ని గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. అక్కడే మందుబాబులు మద్యం తాగుతూ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు