‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి

ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది.

Updated : 17 Apr 2024 09:41 IST

విశాఖపట్నం (పద్మనాభం), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారానికి విశాఖ జిల్లా పద్మనాభం వచ్చిన వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలకు మంగళవారం రాత్రి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ముత్తంశెట్టి మాట్లాడుతూ తెదేపా హయాంలో నాయకులు మట్టి, ఇసుక, కొండలను దోచుకున్నారని ఆరోపించారు. అదే సమయంలో పద్మనాభం నుంచి నీళ్లకుండీల వైపు మట్టిలోడుతో లారీలు వెళుతున్నాయి. 20 నిమిషాల్లో 100 లారీలు ఇలా వెళ్లడాన్ని గమనించి, పక్కనున్న ఎంపీపీని ఆయన ప్రశ్నించారు. తర్వాత స్థానిక సీఐకి ఫోన్‌ చేసి ఏం చెప్పారో గానీ.. పది నిమిషాల తర్వాత పోలీసులు వాటిని రేవిడి వైపు మళ్లించారు. ఈ లారీలు ఆనందపురం మండల వైకాపా నాయకులవని, ఇవి జామి సమీప చెరువు నుంచి ఇక్కడి ఇటుకల బట్టీలకు మట్టిని చేరవేస్తున్నందున జనం ప్రశ్నించక ముందే దారి మళ్లించే ఏర్పాట్లు చేశారని పలువురు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని