వెబ్‌సైట్‌లో పాలిసెట్‌ హాల్‌టికెట్లు

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2024కు హాల్‌టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు.

Published : 17 Apr 2024 05:12 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2024కు హాల్‌టికెట్లు బుధవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గురుకుల పాఠశాలల హాల్‌టికెట్లు: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచామని కార్యదర్శి నరసింహారావు తెలిపారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీతో బుధవారం నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఏపీఆర్‌జేసీ, డీసీ ప్రవేశ పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని