ఏపీఈఏపీ సెట్‌కు 3,54,235 దరఖాస్తులు

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్‌కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 17 Apr 2024 05:55 IST

అపరాధ రుసుంతో మే 12 వరకూ అవకాశం

కాకినాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్‌కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగియగా.. మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్‌కు 2,68,309 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీకి 84,791 మంది, రెండు విభాగాలకు 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. ముందు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఇంజినీరింగ్‌ విభాగానికి మే 18 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. దరఖాస్తులు ఎక్కువ రావడంతో 23వ తేదీ ఉదయం సెషన్‌లోనూ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మే 16, 17న పరీక్షలు ఉంటాయని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.1000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు