జగన్‌ హయాంలో పెరిగిన శిరోముండనం ఘటనలు

జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.

Published : 17 Apr 2024 05:13 IST

ఈనాడు, అమరావతి: జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ లేనన్ని శిరోముండనం ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. ఈ నేరాలు వైకాపా పాలనలోనే ఎక్కువగా జరిగాయి. వైకాపా నాయకుల ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత యువకుడు ఇండుగుమల్లి వరప్రసాద్‌కు సీతానగరం పోలీసుస్టేషన్‌లో.. పోలీసులే శిరోముండనం చేశారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌, సినీ నిర్మాత నూతన్‌ నాయుడు, ఆయన కుటుంబసభ్యులు వారింట్లోనే పెందుర్తి మండలం గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన షేక్‌ ఆషాకు వైకాపా నాయకుల అండతో భర్తే శిరోముండనం చేశారు. రూ.30వేల బాకీ తీర్చలేదంటూ జంగారెడ్డిగూడేనికి చెందిన అలకా అభిలాష్‌కు శిరోముండనం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటకు చెందిన వంశీని కొందరు కిడ్నాప్‌ చేసి శిరోముండనం చేశారు. నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులకు శిరోముండనం చేసింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఈ నేరాలు జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని