వైకాపా పోస్టులను తొలగించండి

వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Updated : 17 Apr 2024 06:48 IST

ఆప్‌, చంద్రబాబులవి కూడా..
ఎక్స్‌కు ఈసీ ఆదేశం

దిల్లీ: వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటితోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరిల పోస్టులనూ తొలగించాలని సూచించింది. ఈ పోస్టులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. మంగళవారం ఈ వివరాలను ఎక్స్‌ వెల్లడించింది. ఈ నెల 2, 3 తేదీల్లో ఈ ఆదేశాలు వచ్చాయని, ఆ తర్వాత 10వ తేదీన ఈమెయిల్‌ ద్వారా ఫాలోఅప్‌ చేశారని తెలిపింది. ప్రజా జీవితానికి సంబంధంలేని వ్యక్తిగత విషయాలను పోస్టుల్లో ఉంచవద్దని ఈసీ సూచించినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని