శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

Updated : 18 Apr 2024 06:35 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన అనంతరం రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీమలయప్పస్వామి కొలువుదీరి భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు చేపట్టారు. గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు సహస్ర దీపాలంకార సేవ.. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్‌, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని