సెలవుపై వెళ్లిన గృహనిర్మాణ సంస్థ ఎండీ

గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది.

Published : 18 Apr 2024 03:47 IST

ఆ స్థానంలో గిరీషా నియామకం

ఈనాడు, అమరావతి: గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఆ స్థానంలో ఎండీగా గిరీషాను నియమించింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమంగా ఓటర్‌ గుర్తింపు కార్డులు డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహరంలో ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెండ్‌ చేసింది. అందులో తన ప్రమేయం లేదని ఆయన ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన ఈసీ ఇటీవల ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో తాజాగా ఆయన్ను ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థ ఎండీగా నియమించింది. సెలవు ముగిశాక సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని వెంకటరమణారెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని