సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు.

Published : 18 Apr 2024 08:01 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. సీఎం రోడ్‌షో జరగనున్న రాజమహేంద్రవరంలోని పలుచోట్ల పచ్చని చెట్ల కొమ్మలను బుధవారం నరికేశారు. సీఎం పర్యటనకు వెళ్లే ప్రతిచోట ఇది పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా అధికార పార్టీ నాయకులు తీరు మార్చుకోవడం లేదు. మరోవైపు రాజమహేంద్రవరంలో దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న సుందరీకరణ పనులు, వీధి దీపాల మరమ్మతులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేస్తుండడం గమనార్హం. ఎన్నికల కోడ్‌ వచ్చే కొద్ది రోజుల ముందు అభివృద్ధి పేరిట నగరంలో పలుచోట్ల రహదారులను ధ్వంసం చేసిన యంత్రాంగం.. ప్రజలు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం పర్యటన నేపథ్యంలో హడావుడి చేస్తున్నారు. కాలువలు అధ్వానంగా ఉన్నచోట అవి ముఖ్యమంత్రి కంట పడకుండా పరదాలు కడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని