వివేకా హంతకులకు ఓటేయొద్దు

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

Updated : 18 Apr 2024 05:55 IST

మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత

పులివెందుల, న్యూస్‌టుడే: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిలను గెలిపించాలని కోరారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలన్నదే వివేకా చివరి కోరిక అని.. అది నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యానని తెలిపారు. ఇందుకు గురువారం నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మీడియా సెల్‌  రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్‌ దాఖలు చేస్తారని ప్రకటించారు. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. సీఎం జగన్‌ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, పులివెందులలో చేపట్టిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు జగన్‌రెడ్డి అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు