బస శిబిరంలోనే సీఎం జగన్‌ విశ్రాంతి

‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు.

Published : 18 Apr 2024 05:11 IST

ఈనాడు డిజిటల్‌ - భీమవరం, తణుకు గ్రామీణం - న్యూస్‌టుడే: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించడంతో అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలను, స్థానిక వైకాపా నాయకులను కలిసేందుకు సుముఖత చూపలేదు. పలువురు నాయకులు శిబిరం వద్దకు వచ్చినా పోలీసులు అనుమతించకపోవడంతో వెనుతిరిగారు. గురువారం ఉదయం 9 గంటలకు శిబిరం నుంచి బయలుదేరి జాతీయ రహదారి మీదుగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని పెరవలి, రావులపాలెం, జొన్నాడ, కడియపులంక, బొమ్మూరు కూడలి మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. నగరంలో తాడితోట, దేవిచౌక్‌, సీతంపేట కూడళ్లు, దివాన్‌చెరువు, రాజానగరంలలో యాత్ర కొనసాగుతుంది. రాత్రి రాజాపురం సమీపాన బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని